లైంగిక దాడులను నిరసిస్తూ ఆందోళన

• పసి పాప నుండి, వృద్ధుల పై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా తేది.24-06-2019న విశాఖపట్టణం పెందుర్తిలో ప్రగతిశీల మహిళాసంఘం ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వక్తలు ఉపన్యసిస్తూ వరంగల్ లో లైంగికోన్మాది చేతిలో పసిపాప బలైందని విజయవాడలో వృద్దారాలి పై అత్యాచారం చేశారని పసిపాపల నుండి వృద్ధుల వరకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనలకు కారణమయిన మూలాలను పరిశీలించి మహిళలపై జరుగుతున్న లైంగిక హింసను నిరోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్. లక్ష్మి, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి రోహిణి, సహాయ కార్యదర్శి ఇందిర, జిల్లా ఉపాధ్యక్షురాలు కె. బాలనాగమ్మ కమిటీమెంబర్లు ఎరుకలమ్మ, రూప, వరలక్ష్మి, గీత పాల్గొన్నారు.


• ఉత్తరప్రదేశ్ ఉన్నావోలో అత్యాచారానికి హత్యా ప్రయత్నానికి గురయిన బాదితురాలికి న్యాయం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తేది. 31/7న జివిఎంసి గాంధీ బొమ్మ వద్ద ప్రజాసంఘాలు ఆద్వర్యంలో జరిగిన ఆందోళనా కార్యక్రమంలో పిఓడబ్ల్యునుండి సుమారు 20 మంది పాల్గొనడం జరిగింది.


• ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ లో అత్యాచారానికి హత్యా ప్రయత్నానికి గురయిన బాధితురాలికి న్యాయం చేయాలని అలాగే నేరస్తులు బిజేపి ఎ న్ఏ కులదీప్ సింగార్ ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ తో 1/ 8న పిఓడబ్ల్యు ఆధ్వర్యంలో పెందుర్తి డాక్టర్ బిఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల పదర్శన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పిఓడబ్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్. లక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి యు. ఇందిర, ఉపాధ్యక్షురాలు బాలనాగమ్మ, కమిటీ మెంబర్ రూప, వరలక్ష్మి, గీత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పిఒడబ్ల్యు నుండి సుమారు 150 మంది పాల్గొన్నారు.


• దిశపై అత్యాచారం చేసి కిరాతకంగా హత్యచేయడాన్ని నిరసిస్తూ తేది. 30-11-2019న విశాఖపట్టణం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో 80 మంది పాల్గొన్నారు.


• దిశపై అత్యాచారం చేసి కిరాతకంగా హత్యచేయడాన్ని నిరసిస్తూ తేది.1-12-2019న పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద పిఓడబ్ల్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పిఓడబ్ల్యు జిల్లా సహాయ కార్యదర్శి యు. ఇందిర, రూప, వరలక్ష్మి, గీత, ఎరుకలమ్మ, పద్మతోపాటు 100 మంది పాల్గొన్నారు.


• దిశ పై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ యస్ కోటలో విద్యార్థులతో కలసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమలో పిఓడబ్ల్యు నుండి ఎస్. వెంకటలక్ష్మి, పార్వతి పాల్గొన్నారు. _


. ఉన్నావ్ లో అత్యాచార బాధితురాలు సాక్ష్యం చెప్పనీయకుండా బాధితురాలిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితులు శివం, శుభం తివేదిలను కఠినంగా శిక్షించాలని కోరుతూ మహిళా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విశాఖపట్టణం జివిఎంసి గాంధీ బొమ్మ వద్ద తేది. 07-12-2019న ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు నుండి ఎమ్. లక్ష్మి, ఎన్ఎబ్ల్యు నుండి విమల, సిఎమ్ఎస్ఎస్ నుండి లలిత పాల్గొన్నారు. ఈ మహిళా సంఘాల ఐక్య వేదిక ఆందోళనలో పిఓడబ్ల్యు నుండి 20 మంది పాల్గొన్నారు. ఈ


• డిశంబర్ 16 నిర్భయాడే సందర్భంగా జిప్టస్ వర్మ కమీషన్ సిఫార్సులును అమలు చేయాలని, మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తేది. 16-12-2019 విశాఖపట్టణం జివిఎంసి గాంధీ బొమ్మ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమలో పిఓడబ్ల్యు తరపున ఎమ్. లక్ష్మి, ఇందిర, రూప, బాలనాగమ్మ, వరలక్ష్మి, ఎన్ఎబ్ల్యు నుండి విమల, సిఎమ్ఎస్ఎస్ నుండి లలిత పాల్గొన్నారు. మహిళా సంఘాల ఐక్య వేదిక అద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు నుండి 100 మంది పాల్గొన్నారు.