భారతప్రధానన్యాయమూర్తిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపైనిష్పక్షపాతపారదర్శకవిచారణ జరపాలి.

-- డాక్టర్ అపర్ణ, అనువాదం - సుధా, వైజాగ్...


దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీశ కోర్టుకి చెందిన మరో న్యాయమూర్తిపై లైంగిక హింస ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు మరోసారి అట్బడికిపోయింది. ఈసారి ఆరోపణలు ఎదుర్కొన్నది ఏకంగా సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తీ (సి.జె.ఐ.) ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీం కోర్టులో పారదర్శక విచారణ జరిపే విధానం లేదనేది మరోసారి రుజువైంది. గతంలో కొంత మంది న్యాయమూర్తుల మీద ఇటువంటి ఆరోపణలు రాబట్టి జెండర్ హింస విచారణ విధానం రూపొందించారు. కాని దేశ ప్రధాన న్యాయమూర్తిపై విచారణకు లేదు! ఇదే కోర్టు విశాఖ తీర్పు ఇచ్చి, దేశంలో అందుకు ఒక చట్టం రూపొందిన ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఇదే పరిస్థితి. ఈ విషయంలో తమకు చట్టం వర్తించదని, తాము ఇచ్చిన అదేశాలు తమకే వర్తించవని న్యాయమూర్తులు చెప్పకనే చెబుతున్నారు. .


మీడియాలో ఈ వార్త వెలువడగానే దేశ ప్రధాన న్యాయమూర్తి చేపట్టిన మొట్ట మొదటి చర్య తాము ధర్మాన్ని కాపాడే వారిమని మర్చిపోయారు. న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి నిర్లజ్జగా కక్షసాధింపుకు అధికార దర్పానికి పాల్పడ్డారు. ఈ ఆరోపణలు న్యాయవ్యవస్థపై జరిగిన దాడని, న్యాయ వ్యవస్థ స్వంత్రతకు విఘాతం కలిగించే కుట్రపూరిత దాడని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. జస్టిస్ రంజన్ గోగోయి స్వయంగా ధర్మాసనంలో కూర్చోని ఫిర్యాది చరిత్ర హీనురాలన్నట్లు అభివర్ణిస్తూ విషం చిమ్ముతూనే ఉన్నారు. అతని సంతకం లేకుండా ఆ ధర్మాసనం మీడియాలో ఈ విషయమై కధనాలు రాయకూడదనే నిషేధాజ్ఞలు విధించింది. ఫిర్యాది వ్యక్తిత్వంపై ఈ విధంగా ఆరోపణలు చేయడం . తప్పని ఇప్పటి వరకూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎవరూ నోరు విప్పి విచారం వ్యక్తం చేయలేదు. వారందరూ ప్రధాన న్యాయమూర్తి కింద పని చేసే వారు కనుక క్షమాపణ చెప్పండని అడిగే సాహససానికి పూనుకోలేరు. ఇదిమొదటి సారి కాకపోయి నప్పటికీ, వ్యక్తుల కంటే సంస్థ ఉన్నతమైనదనే విలువను వారెవరూ కాపాడలేక పోయారు.


| దేశ ప్రధాన న్యాయమూర్తి తనపై లైంగిక హింసకు పాల్పడిన విషయం, అమెఅప్రయత్నాలనుఅంగీకరించకపోయే సరికి తనపై, తన కుటుంబ సభ్యులపై ఆయన నిర్దాక్షిణ్యంగా ఏ విధంగా వేధింపు చర్యలకు పాల్పడిన విషయం ఒక అఫిడవిట్ ద్వారా న్యాయముర్తులకు అందరికీ తెలియచేసి న్యాయం పొందే ప్రయత్నం చేసారు. అఫిడవిట్ తయారు చేయడంలో ఆమెకు తాము సలహా ఇచ్చామని, ఆమె అదే కోర్టు నుండి తొలగించబడ్డ ఉద్యోగిని అని అనే విషయం అనేక మంది సీనియర్ న్యాయవాదులు తెలిపారు. ఈ విషయంలో విచారణ జరపాలని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్, అసోసియేషన్ అఫ్ అడ్వకేట్స్ ఆన్ రికార్డు సహా న్యాయ వ్యవస్థతో అనుబంధమున్న వారంతా డిమాండ్ చేసే సరికి సి.జె.ఐ. కేసును తన తరువాత సీనియరైనా సుప్రీం కోర్టు న్యాయమూర్తికి అప్పగించారు. ఈ న్యాయమూర్తి గారు వచ్చి చేసినదేమిటంటే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టాన్ని, విశాఖ తీర్పుని తుంగలోకి తొక్కడం. పని ప్రదేశంలో లైంగిక హింసపై దర్యాప్న సక్రమంగా జరగాలంటే చేయవలసిన కనీస పని ఫిర్యాది వ్యక్తిత్వంపై దాడికి పూనుకున్న సి.జె.ఐ. ని విచారణ జరిగినంత కాలం బాధ్యతల నుండి తప్పించడం. ఆ విధంగా చేస్తే సాక్షులు నిర్భయంగా వచ్చి సాక్ష్యం చెప్పే వీలుండేది. ఈపాటి కనీస న్యాయ సూత్రం జస్టిస్ బొట్టే కూడా పాటించలేదు. ఈ విషయంలో కొలీజియంలోని మిగిలిన న్యాయమూర్తులు కూడా ఈ దేశ స్త్రీలకూ, న్యాయం అనే భావనకు తీరని అన్యాయం చేసారు. అంతర్గత కమిటీలో మెజారిటీ స్త్రీలు ఉండాలనే ప్రాధమిక నిబంధనను విస్మరించారు. కమిటీలో ఈ చట్టంపై పట్టున్న స్త్రీ, అందునా పని ప్రదేశం బైట నుండి వచ్చిన స్త్రీ అయిఉండాలనే సూత్రాన్ని మరిచారు. ఫిర్యాది నిరసన వ్యక్తం చేసేసరికి, ముగ్గురు సభ్యుల గల కమిటీలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులను చేర్చారు. దీన్ని న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన కుట్రగా ప్రధాన న్యాయమూర్తి అభివర్ణించగానే ఒక యువ న్యాయవాది ప్రత్యక్షమై తన దగ్గర ఈ కుట్ర నిరూపించే సాక్ష్యం ఉందనే సరికి జస్టిస్ బొట్టే ఈ విషయంలో విచారణ జరిపేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విచారణ కమిటీని కూడా సమాంతరంగా నియమించారు.మంచి చెడుల పట్ల కొంత వరకూ అవగాహన ఉండబట్టి అనుకుంటా విరామన్యాయమూర్తి జస్టిస్ పట్నాయక్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం లైంగిక వేధింపుల ఆరోపణలపై అంతర్గత కమిటీ విచారణ పూర్తి అయిన తరువాతే తాము విచారణ మొదలు పెడతామన్నారు.


ఈ సందర్భంగా ఆమె 22 మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తు న్యాయముర్తులకు సమర్పించిన అఫిడవిట్లో చేసిన డిమాండ్ గురించి ప్రస్తావించడం అవసరం. సుప్రీం కోర్టులో ప్రస్తుతం పని చేస్తున్న న్యాయమూర్తులు అందరూ ప్రధాన న్యాయమూర్తి కింద పని చేస్తున్నారు కనుక కమిటీలో సుప్రీం కోర్టు విరామ న్యాయమూర్తులను నియమించాలని ఆమె కోరారు. పారదర్శకత ఉండే విధంగా ఆధునిక పరికరాల వాడి మొత్తం విచారణను వీడియో రికార్డు చేయాలని కూడా ఆమె సూచించారు. ఒక అత్యున్నత వ్యవస్థ ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కుంటుంది కాబట్టి విచారణ ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈ ప్రతిపాదనకు ఎగిరి గంతేసి ఆహ్వానిస్తారని అనుకుంటాం. నిజం రుజువు కావాలనుకునే ఏ వ్యక్తి అయినా విచారణ న్యాయసమ్మతంగా జరగాలని కోరుకుంటాడు. ఈ కేసులో మటుకూ ఆవిధంగా జరగ లేదు.


| అఫిడవిట్ ప్రజల ముందు ఉంది. అనేక వార్తా సంస్థలు, పత్రికలూ దాన్ని ప్రచురించాయి. రూడి చేసుకోగలిగే ఆరోపణలు, లంచం తీసుకుందనే చిన్న ఆరోపణపై అరెస్టు చేయడం, పోలీస్ స్టేషన్లో గొలుసుతో కట్టిపడేయడం సహా సీనియర్ పోలీస్ అధికార్ల జులుంకి గురికావడం, భూ, బావ పోలీసు శాఖలో తమ ఉద్యోగాలు కోల్పోవడం వంటి విషాదకర అంశాల పరంపరతో అది నిండి ఉంది.


| అమె చెప్పేది ఏమిటో తెలుసుకోక ముందే సుప్రీం కోర్టు ఉద్యోగుల సంఘం ఖండించి గొప్ప ఘనత సాధించింది. పని ప్రదేశంలో జరిగిన లైంగిక హింస ఆరోపణపై విచారణ జరపాలని అడగాల్సిన బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా కూడా ప్రభువుల మాటకు మాట కలపడం, వత్తాసు పలకడంలోనే నిమగ్నమైపోయి చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతను ఘోరంగా విస్మరించింది.


| మన దేశంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చట్టాన్ని కాపాడాల్సిన వారు ఈ విధంగా పురుషాహంకార విలువలను ప్రదర్శించే విధంగా ప్రవర్తించడం సర్వ సాధారణం. సుప్రీం కోర్టు ఆవరణలో కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయ దేవత న్యాయాన్ని తూకం సరిగానే వేస్తుందేమోకానీ ఈ కోర్టులోని న్యాయ సుత్తే (judicial hammer) ఆమె తలపై గట్టిగా మొత్తింది. విశాఖ తీర్పుకి దారి తీసిన భన్వారి దేవి కేసు మినహాయించి అధికార దర్పంతో పాల్పడే లైంగిక హింస కేసుల్లోమచ్చుకకైన న్యాయం జరిగిందని చెప్పలేం. ఫిర్యాది ఎఫ్.ఐ.ఆర్. రిజిస్టర్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తే తప్ప ఇటువంటి కేసుల్లో న్యాయం జరగలేదు. దేశ రాజధానిలోని పనిప్రదేశాల్లో జరిగిన లైంగిక హింస సంఘటనలనే తీసుకోండి - ఎల్.ఆర్.ఎస్. టి.బి.ఆస్పత్రిలో నర్స్ చేసిన ఫిర్యాదు (ఇందులో కూడా ప్రభుత్వం ఆదేశించగాకింది స్థాయి అధికార్లతో విచారణ జరిపించారు), సుప్రీమ్ కోర్టు న్యాయముర్తులుపై న్యాయశాస్త్ర ఇంటర్చ్ చేసిన ఆరోపణ, ఒక ప్రఖ్యాత సంస్థలోని సీనియర్ లైబ్రేరియన్ పై లైబ్రేరియన్లు చేసిన ఫిర్యాదు - అంతటా ఒకే తీరు - విశాఖ/ అంతర్గత కమిటీ దోషులకు క్లీన్ చిట్ ఇచ్చేసాయి. సారైటైటర్ పాత నవల అయి ఉండొచ్చు కాని 2019 నాటి భారత దేశంలో తప్పు మటుకూఎప్పుడూ ఫిర్యాదిదే..


తరుణ్ తేజాల్, తేరి సంస్థ మాజీ డైరెక్టర్ కేసుల్లో సాగుతున్న క్రిమినల్ కేసుల విచారణ ఇందుకు భిన్నంగా ఉండొచ్చేమో కానీ ఈ రెండూ కేసుల్లో సంస్థాపరంగా జరిగిన విచారణలు ఫిర్యదారులకు తీరని అన్యాయం చేస్తాయి. దురహంకారంతోలైంగిక హింస పాల్పడిన వారి చర్యలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలను ఉపేక్షించే వారు 'మీ టూ' ఉద్యమం గురించి ఇంత 'అన్యాయమైన పద్ధతి' అవలబిస్తారా అని ముక్కున వేలేసుకున్నప్పటికీ, 'మీ టూ' ఉద్యమం పుణ్యమా అంట దోషులను బహిరంగంగా నిలదీసి న్యాయం పొందే అవకాశం చిక్కింది.


| ఈ కేసులో విచారణ కొనసాగుతుంది. ఇది ఏ దారి తీసుకుంటుంది ఇప్పుడే ఉహించడం తగదు. అయితే గతానుభవం చాలా ఏకపక్షంగా ఉంది. ఒకే గుణపాటం నేర్పింది. న్యాయం కోసం బలమైన ఉద్యమాలు ఉంటేనే తప్ప ఈ కేసుల్లో ఒక్క అడుగు కూడా ముందుకి వెయలేము. సంఘటన పట్ల దృష్టి సారించడం, ఆగ్రహించడం జరగదు. ఈ కేసులో కుడా సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్, వ్యక్తిగత స్థాయిలో సీనియర్ మహిళా న్యాయవాదులు ధైర్య సాహసాలతో ప్రకటనలు జారీ చేయడం, ప్రగతిశీల మహిళా సంఘటన్ కు చెందిన లాయర్ల నాయకత్వంలో ఢిల్లీ లాయర్లు సుప్రీం కోర్టు ముఖ ద్వారం ఎదుట పారదర్శకతో కూడిన స్వతంత్ర విచారణ జరపాలనికోరుతూ పోస్టర్లు పట్టుకుని నిలబడ బట్టి ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ కమిటీకి కేసును అప్పగించక తప్పలేదు. న్యాయ వ్యవస్థలో చాలా మంది ఈ అందోళనకు మౌనాంగీకరం వ్యక్తం చేసినప్పటికీ అది సరిపోదు.


| కేంద్ర హెూం శాఖ మంత్రికి ఈ ఏడాది జనవరిలో తాను ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాది న్యాయమూర్తులకు ఇచ్చిన అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొంది. విధుల నుండి ఒక రోజు గైర్హాజరు అయినందుకు ఆమెపై అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేశారని, కోర్టు సిబ్బంది ఫిర్యాదిని సుప్రీం కోర్టు ఆవరణ నుండి ఆస్పత్రికి తరలించారని తెలిసి కూడా ఈ ఆరోపణలపై సుప్రీం కోర్టులో అఘమేఘాలపై ఒక్క రోజు వ్యవధిలో అంతర్గత విచారణ పూర్తి చేసి తీర్పు వెల్లడించేసిందని, ఆమె ఎటువంటి నేరాలకు పాల్పడలేదని తెలుసుకొని ఒక సీనియర్ పైఅధికారి ప్రకోపించబట్టే ఆమె అందుకు మూల్యం చెల్లిస్తున్నట్లు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికార్లు స్టేటిమెంట్లు ఇచ్చారని ఆమె తన అఫిడవిట్లో పేర్కొన్నారు. పని ప్రదేశంలో తన పై జరిగిన లైంగిక హింస విషయంలో తనకు న్యాయం చేకుర్చమని ప్రాధేయ పడిన ఫిర్యాది గొంతు నులమడానికి రాజ్యంలోని ప్రతి అంగం తాపత్రయ పడింది. నిర్భయ కేసు సర్దుమణగడానికి కారణమైనముగ్గురుసభ్యులు గల వర్మా కమిషన్ రాజ్యంలోని ప్రతి అంగంలో జెండర్ సెన్సిటైజేషన్ జరిగి తీరాలని వేలెత్తి చూపింది. 'మంచి పురుషులు” పాలించాలి అనే ఈ పరిష్కారం అంతిమంగా ఉద్యమానికే చెటైయ్యింది. అది పురుషాధిక్యత వ్యతిరేక ఉద్యమంగా రూపుదిద్దుకొంది. అయినా ఒక సామాజిక విప్లవం అవసరం.